ప్రమాదకరంగా దయార్తి పాఠశాల భవనం
NEWS Oct 30,2025 09:00 pm
అనంతగిరి: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అనంతగిరి మండలం, జీనబాడు పంచాయతీ పరిధిలోని దయార్తి పాఠశాల భవనం తీవ్రంగా దెబ్బతింది. సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాల భవనానికి బీటలు పడటంతో వర్షాల సమయంలో పైకప్పు నుంచి నీరు కారుతూ, పెచ్చులు క్రింద పడుతున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. “ఎప్పుడు భవనం కూలిపోతుందో తెలియడం లేదు” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి విద్యార్థుల ప్రాణభద్రత కోసం తక్షణ చర్యలు తీసుకుని ప్రత్యామ్నాయ భవనాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.