బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది
NEWS Oct 30,2025 11:12 am
మొంథా తుఫాన్ ప్రభావంతో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు కూలిపోయింది. వైఎస్సార్ కడప జిల్లాలో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం ఉండగా.. భారీ వర్షానికి గోడలు బాగా తడిసిపోయియా. ఈ క్రమంలో ఇంటిలోని ఒక భాగం మొత్తం కుప్పకూలింది. ఆ సమయంలో ఆ చారిత్రక భవనంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు, స్థానికులు తెలిపారు. ఈ కూలిపోయిన నివాసానికి సుమారు 350 సంవత్సరాల చరిత్ర ఉందని బ్రహ్మేంద్ర స్వామి మఠం నిర్వాహకులు తెలిపారు.