మిట్టపాలెం ఎస్సీ కాలనీ జలమయం
NEWS Oct 30,2025 11:07 am
కొండేపి మండలం మిట్టపాలెం ఎస్సీ కాలనీ తుపాన్ ప్రభావంతో తీవ్రంగా జలమయమైంది. గత 3 రోజులుగా మోకాళ్ల లోతు నీటిలో సుమారు 15 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంతో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తెలుసుకున్న గ్రామ ఉపసర్పంచ్ మండవ మాలకొండయ్య కాలనీని సందర్శించి, ఇళ్లలోకి చేరిన నీటిని పరిశీలించారు. అనంతరం జేసిబితో కాలువ తీయించి నీటిని బయటకు పంపే చర్యలు ప్రారంభించారు. ప్రజలు అధికారులు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.