తుపాన్ దాటికి గిరిజనుడి ఇల్లు ధ్వంసం
NEWS Oct 30,2025 11:01 am
అనంతగిరి: మెంతా తుపాన్ తీవ్ర ప్రభావంతో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ పరిధిలోని పూతిక పుట్టు గ్రామంలో గురువారం తెల్లవారుజామున మాదేల కన్నయ్య నివాస గృహం గోడలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్నానని కన్నయ్య వాపోయారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి తనను, కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు.