వైజాగ్-పాడేరు ఘాట్ రోడ్డులో విరిగి పడ్డ భారీ కొండచరియలు
NEWS Oct 30,2025 10:58 am
విశాఖపట్నం: మెంతా తుపాన్ ప్రభావంతో విశాఖపట్నం నుండి పాడేరు వెళ్లే మార్గంలో కాంతమ్మ వ్యూ పాయింట్ వద్ద నిన్న రాత్రి భారీ కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. కొండపై నుండి పెద్ద పెద్ద రాళ్లు, మట్టి రహదారిపైకి రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంబంధిత అధికారులు అక్కడికి చేరుకొని రాకపోకలు సాధారణం చేయడానికి చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.