కొండపి మండలం: తుఫాన్ ప్రభావంతో పెరిగిన నీటిమట్టం కారణంగా చోడవరం సమీపంలోని మూసీ నది అవతల వైపు పొగనారు దొడ్ల వద్ద పని చేస్తున్న 40 మంది కూలీలు చిక్కుకున్నారు. మంత్రి స్వామి ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను తక్షణమే రంగంలోకి దించారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ రక్షణ చర్యలను వేగవంతం చేశారు. 20 మంది కూలీలను బోట్ల సహాయంతో సురక్షితంగా గ్రామానికి చేర్చినట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. మిగతా 20 మందిని కూడా త్వరలో సురక్షితంగా రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.