సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభం
NEWS Oct 30,2025 10:59 am
అందోలు మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, అందోలు మండలం రాంసాన్‌పల్లి పోల్కల్‌లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పత్తిని నేరుగా సీసీఐ కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు.