తెలుగు రాష్ట్రాలను మొంథా తుపాను వణికిస్తోంది. అయితే ఈ తుపానుకు మొంథా అనే పేరును సూచించింది థాయిలాండ్ దేశమని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఆఫీసర్ జగన్నాధ్ చెప్పారు. ‘మొం’ ‘థా’ అనే రెండక్షరాల కలయికే మొంథా. థాయ్‌లో మొంథా అంటే సువాసనలు వెదజల్లే పువ్వు లేదా అందమైన పువ్వు అని అర్థం. థాయి సంస్కృతిలో మొంథా పువ్వుకు విశిష్ఠ స్థానం ఉంది. ఈ పువ్వును దేవాలయాలలోనూ, బౌద్ధ విగ్రహాల వద్ద నివేదిస్తుంటారు. దీని ద్వారా ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు.