రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు
NEWS Oct 29,2025 09:49 pm
అనంతగిరి మండలం: లుంగపర్తి పంచాయతీ పరిధిలోని పులుసు మామిడి గ్రామ సమీపంలోని రైగండువా ప్రాంతంలో కొండచరియలు విరిగి పడ్డాయి. భారీ వర్షాల ప్రభావంతో పెద్ద పెద్ద రాతి బండలు రహదారి మీదకు జారిపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక యువకుడు మజ్జి దామోదర్ మాట్లాడుతూ, “కొండచరియలు రోడ్డుమీద పడిపోవడంతో గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కొనసాగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది” అని తెలిపారు. గ్రామస్తులు మండల అధికారులను తక్షణమే స్పందించి రహదారి నుంచి రాళ్లను తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశారు.