TG: అజారుద్దీన్‌కు మంత్రి పదవి?
NEWS Oct 29,2025 06:12 pm
కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్‌కు మంత్రి పదవి లభించినట్టు తెలుస్తోంది. ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ జరగనుందని, ఆయన మంత్రిగా ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధిష్ఠానం నుంచి అనుమతి లభించినట్లు సమాచారం. మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం 15 మంది మంత్రులు ఉన్నారు. మరో ముగ్గురికి అవకాశం ఉంది. మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు మంత్రిగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.