‘బాహుబలి: ది ఎపిక్’ ఈ నెల 31న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా.. రాజమౌళి, ప్రభాస్, రానా ప్రత్యేక ఇంటర్వ్యూలో చిత్రీకరణ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ఎడిటింగ్‌లో భాగంగా తొలగించిన సీక్వెన్స్‌ల వివరాలను రాజమౌళి తెలిపారు. ‘బాహుబలి: ది ఎపిక్’ రన్‌టైమ్ 3:45 గంటలు అని చెప్పిన రాజమౌళి.. అవంతిక లవ్‌స్టోరీ, పచ్చబొట్టేసిన పాట, ఇరుక్కుపో సాంగ్, కన్నా నిదురించరా సాంగ్, యుద్ధానికి సంబంధించిన కొన్ని సీన్లును తొలగించామన్నారు. ఈ ఇంటర్వ్యూలోని పలు ఆసక్తికర సంగతులు చూడండి.