చేపలు వేట నిషేధం - విఆర్వో ప్రశాంతి
NEWS Oct 29,2025 12:53 pm
అనంతగిరి: మెంతా తుపాన్ ప్రభావం కారణంగా మత్స్యకారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్ళరాదని జీనబాడు విఆర్వో ప్రశాంతి సూచించారు. అనంతగిరి మండలం జీనబాడు గ్రామంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు జి. సురేష్‌తో కలిసి రైవాడ రిజర్వాయర్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డ్యామ్ వద్ద మత్స్యకారులతో మాట్లాడుతూ, “తుపాన్ తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాణ భద్రత దృష్ట్యా చేపల వేటకు వెళ్లరాదు” అని విజ్ఞప్తి చేశారు. తుపాన్ పరిస్థితులపై అవగాహన కల్పిస్తూ మత్స్యకారుల కుటుంబాలతో సమావేశం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు సురేష్, మత్స్యకారులు, గ్రామస్తులు, విఆర్ఏలు పాల్గొన్నారు.