AI టెక్నాలజీతో బాహుబలి యూనివర్స్
NEWS Oct 29,2025 04:58 pm
బాహుబలి 2 భాగాలను కలిపి, "బాహుబలి: ది ఎపిక్" పేరుతో ఈ అక్టోబర్ 31న మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఐతే రాజమౌళి తన కొత్త ఆలోచనతో "బాహుబలి యూనివర్స్"ను మరోసారి కొత్త కోణంలో మలచేందుకు ప్రయత్నిస్తున్నారని, లైవ్ యాక్షన్ కాకుండా AI టెక్నాలజీతో యానిమేటెడ్ ఫార్మాట్‌లో తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. "యానిమేటెడ్ వెర్షన్ ఆఫ్ బాహుబలి 3" ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉందని, నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి సారించారని టాక్. ప్రభాస్ ఇప్పటికే "కల్కి 2898 AD", "సలార్ 2" వంటి భారీ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండగా, అనుష్క సినిమాలను తగ్గించుకున్నారు. రానా పాత్ర (భల్లాలదేవ) గత భాగంలోనే ముగిసింది.