నిలువ నీడ కోల్పోయిన కుటుంబం
NEWS Oct 29,2025 05:09 pm
అల్లూరి జిల్లా: తుపాన్ ప్రభావంతో అనంతగిరి మండలంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. పినకోట పంచాయతీ పరిధిలోని వాజంగి గ్రామానికి చెందిన తామర్ల ఎండన్న రేకుల ఇల్లు సాయంత్రం ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. వర్షపు తుపానుతో ఇల్లు కూలిపోవడంతో నిలువ నీడలేకపోయిన ఎండన్న రేకులు కన్నీటి పర్యంతమయ్యారు. “ఇల్లు కోల్పోయి ఆవరణలేని స్థితిలో ఉన్నాం. ప్రభుత్వం, అధికారులు సహాయం అందించాలి,” అని ఆయన వేడుకున్నారు.