పెదగెడ్డ వాగు ఉప్పొంగి జలకళ
NEWS Oct 29,2025 05:06 pm
అల్లూరి జిల్లా: తీవ్ర తుఫాన్ మెంతా ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వాగులు, వంకలు పొంగిపొర్లేలా చేశాయి. ముఖ్యంగా పెదగెడ్డ వాగు నిండుకుండల జలకళతో తళతళలాడుతోంది. కొండ వాగులు, చల్లగెడ్డ, చిట్టగెడ్డ, కాంగెడ్డలతో పాటు పరిసర ప్రాంతాల నుండి భారీగా నీరు చేరడంతో సాధారణంగా అడుగంటిపోయే పెదగెడ్డ వాగు ఇప్పుడు అద్భుత దృశ్యంగా మారింది. వాగులో ఉప్పొంగి ప్రవహిస్తున్న నీరు చూడటానికి వచ్చిన వారిని అబ్బురపరుస్తోంది. స్థానికుల ప్రకారం, ఈ వాగులో ప్రవహించే నీటి అధిక భాగం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని రైవాడ జలాశయంలో కలుస్తుందన్నారు.