గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేయాలి
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
NEWS Oct 29,2025 05:04 pm
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పంచాయతీ శాఖ పనితీరు పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా, అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలని సూచించారు. అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో శానిటేషన్, చెత్త నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ హితవు పలికారు.