హస్తకళలకు ప్రోత్సాహం: డిసిసి అధ్యక్షులు
NEWS Oct 29,2025 11:32 am
నిర్మల్: నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఆధునాతన అనిత శ్రీనివాస్ ఎంబ్రాయిడరీ డిజైనింగ్ సెంటర్‌ను డిసిసి అధ్యక్షులు కె. శ్రీహరి రావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హస్తకళ సంస్థల పరిధిలోకి వచ్చే ఇలాంటి సెంటర్‌ను నిర్మల్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వినూత్న రీతుల్లో ఎంబ్రాయిడరీ, చిత్రకళా డిజైన్లను రూపొందిస్తున్న నిర్వాహకుల ప్రతిభను ఆయన ప్రశంసించారు. స్థానిక కళాకారులను ప్రోత్సహించడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఎంతో అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో గాజుల రవి, అరవింద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.