ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచన
NEWS Oct 29,2025 05:03 pm
ప్రకాశం జిల్లా: మొంథా తుపాను ప్రభావంతో కొండేపి మండలంలో వాగులు ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కొండేపి అట్లేరు, అనకర్లపూడి మూసి వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఎస్సై ప్రేమ్‌కుమార్ ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. వాగులు తగ్గేవరకు ఎవరూ ఆ మార్గాల్లో ప్రయాణాలు చేయరాదని, పొంగుతున్న నీటిలోకి వెళ్లడం ప్రాణహానికరమని హెచ్చరించారు. సాయంత్రం వరకు ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.