మొంథా తుపాను: ప్రజలకు ఫ్రీగా సరుకులు
NEWS Oct 29,2025 01:07 pm
మొంథా తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరకుల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు ఫ్రీగా పంపిణీ చేస్తారు. ప్రతి కుటుంబానికి బియ్యం 25 కిలోలు (మత్స్యకారులకు 50 కిలోలు), కందిపప్పు కిలో, నూనె ఒక లీటర్, ఉల్లిపాయలు కిలో, బంగాళాదుంపలు కిలో, చక్కెర కిలో పంపిణీకి ఆదేశాలిచ్చారు. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా చర్యలు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతర కూరగాయల సరఫరా బాధ్యతలను మార్కెటింగ్ కమిషనర్‌కు అప్పగించారు.