తెలంగాణలో 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు
NEWS Oct 29,2025 12:57 pm
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.