హీరోయిన్‌గా మహేశ్‌బాబు మేనకోడలు ఎంట్రీ
NEWS Oct 29,2025 12:18 pm
మహేశ్ బాబు మేనకోడలు, మంజుల కూతురు జాన్వీ స్వరూప్ హీరోయిన్‌గా మారనుంది. నేడు జాన్వీ బర్త్ డే సందర్భంగా ఆమె ఫొటోలను మంజుల విడుదల చేశారు. కుమార్తె తెరంగేట్రంపై మంజుల ఆనందం వ్యక్తంచేస్తూ ఆమెను ఆదరించాలని కోరారు. జాన్వీ 2018లో ‘మనసుకు నచ్చింది’లో బాలనటిగా గెస్టు రోలో చేసింది. ఆ సినిమాకు మంజుల దర్శకత్వం, మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక తాజాగా ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. జాన్వీ ఘట్టమనేని నటించనున్న ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.