ఉన్నట్టుండి పెరిగిన బంగారం ధరలు
NEWS Oct 29,2025 11:27 am
4-5 రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నబంగారం, వెండి ధరలు.. ఉన్నట్టుండి బుధవారం భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.760 పెరుగగా, 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.700 వరకు ఎగబాకింది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,21,580 వద్ద చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,450 వద్ద ఉంది. ఇక కిలో వెండి ధర రూ. 1 లక్షా 52,000 వద్ద కొనసాగుతోంది.