మహారాష్ట్రలోని థానే, అంబికా నగర్‌లో ఓ యువకుడు హెల్మెట్ లేకుండా వెళ్ళినందుకు ట్రాఫిక్ పోలీసులు అతనికి చలాన్ జారీ చేశారు. ట్రాఫిక్ పోలీస్ వెళ్లడానికి సిద్ధమవుతుండగా, ఓ విద్యార్ధి పోలీస్ అధికారి నడుపుతున్న స్కూటర్‌పై ఉన్న నంబర్ ప్లేట్ సరైన విధంగా లేదని గమనించాడు. వెంటనే అతను వారిని ఆపి మొత్తం వీడియోను రికార్డ్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులు ఆ స్కూటర్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తున్నామని చెప్పగా, మరోవైపు ఆ స్కూటర్‌పై \"పోలీస్\" స్టికర్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. చట్టాన్ని అమలు చేసే ట్రాఫిక్ పోలీసులు కూడా చట్టాన్ని పాటించాలి కదా — చలాన్లు వేయడానికి ముందుగా తాము నియమాలు పాటించడం ముఖ్యం కదా? అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.