AP: మొంథా తుఫాను ప్రభావంతో పలు జిల్లాలు వర్షాల బీభత్సంతో వణికుతున్నాయి. అల్లూరి జిల్లాలోని అరకు ఘాట్ రోడ్డుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు. ఇక, ప్రకాశం జిల్లాలో యరజర్ల-వెంగముక్కలపాలెం మధ్య వాగు ఉప్పొంగడంతో ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. కాకినాడ-మచిలీపట్నం తీరానికి తుపాను చేరువ కావడంతో వర్షాలు మరింత ఉధృతం కానున్నాయని అధికారులు హెచ్చరించారు.