ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
NEWS Oct 28,2025 11:35 pm
విజయవాడ: మోంథా తుఫాను కారణంగా ఆంధ్రాలో స్కూల్స్, కాలేజీలకు అక్టోబర్ 31వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో పలు జిల్లాల్లో మోంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఏపీ ఆర్‌టీజీఎస్ హెచ్చరించింది. ఈ 7 జిల్లాల్లో బుధవారం ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.