తీవ్రస్థాయిలో మోంథా తుఫాను ఎఫెక్ట్
NEWS Oct 28,2025 11:32 pm
మోంథా తుఫాను ప్రభావంతో విజయవాడ, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే 122 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. 29 రైళ్లను దారి మళ్లించింది. విజయవాడ, విశాఖపట్నం మధ్య రైళ్ల రాకపోకలు పూర్తిగా బంద్. బెంగళూరు, చెన్నై నుంచి హౌరా, సికింద్రాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లూ రద్దు. మోంథా తుఫాన్ కారణంగా మొత్తం 160 రైళ్లు రద్దు కావడంతో రైలు ప్రయాణికులు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఈస్ట్ కోస్ట్ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్ రైళ్లు రద్దయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు చేశారు. నేడు, రేపు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.