ఓ ఆఫీసు దీపావళి వేడుకలో ఓ అమ్మాయి డాన్స్ చేస్తుంటే ఆ వెనకాల ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. ఆ సందడి అతని మీద ఏమాత్రం ప్రభావితం చేయలేదు. మిగతా వారందరూ డాన్స్, వేడుకలో మునిగి పోతుండగా, ఈ వ్యక్తి తన ల్యాప్‌టాప్‌లో పనిలో బిజీగా ఉన్నాడు. అతను ఎరుపు రంగు కుర్తా ధరించి పూర్తిగా స్క్రీన్‌పై దృష్టి పెట్టాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో “ఎర్ర కుర్తా వ్యక్తి”తో సందడి చేస్తోంది. సోషల్ మీడియా అంతా “పని పట్ల అంకితభావం.. ఎర్ర కుర్తా సోదరా, నువ్వు నిజమైన లెజెండ్!” అని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.