వ్యవసాయ రంగం ప్రస్తుతం వ్యవసాయ కూలీల కొరత ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పొలాల్లో అగ్రికల్చర్ డ్రోన్ సాయంతో పురుగు మందులను మీరు పిచికారి చేస్తూ ఆదాయం పొందవచ్చు. ₹4 లక్షల నుంచి ఈ డ్రోన్ ధరలు ఉంటాయి. ఒక ఎకరం పొలానికి పురుగు మందులు పిచికారి చేస్తే అన్నీ ఖర్చులు పోనూ ఓ ₹300 మిగులుతాయి. అలా రోజుకు 10 ఎకరాలు చేసినా.. రోజుకు ₹3000, నెలకు ₹90 వేల వరకు ఆదాయం పొందవచ్చు.