సింగరాయకొండ తీరగ్రామాల్లో మంత్రి పర్యటన
NEWS Oct 29,2025 12:25 pm
కొండపి నియోజకవర్గంలో మొంథా తుఫాన్ సృష్టించిన ప్రభావంపై రాష్ట్ర మంత్రి డొలా బాల వీరాంజనేయ స్వామి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. సింగరాయకొండ మండలం పరిధిలోని తీర ప్రాంత గ్రామాలైన ఊళ్లపాలెం, పల్లెపాలెం, పాకలలో ఆయన పర్యటించారు. కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మంత్రి గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. అక్కడ నివసిస్తున్న ప్రజలకు ధైర్యం చెప్పి, "ఎవరూ ఆందోళన చెందవద్దు, అధైర్యపడొద్దు. కూటమి ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం," అని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ మనోజ్ కూడా పాల్గొన్నారు.