ఏర్పాట్లు పరిశీలించిన ఎస్సై నాగమల్లేశ్వరరావు
NEWS Oct 29,2025 12:20 pm
ప్రకాశం: టంగుటూరు మండలం, పొందూరు గ్రామంలో తుపాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో కల్పించిన ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. "తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అందరికీ అన్ని విధాలా అండగా ఉంటాం. ప్రజలు పునరావాస కేంద్రంలోనే సురక్షితంగా ఉండాలి," అని ఎస్సై నాగమల్లేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.