మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
NEWS Oct 28,2025 03:29 pm
బంగారం ధరలు ఇవాళ కూడా తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,460కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.1,10,750గా ఉంది. అటు వెండిపై రూ.5,000 తగ్గింది. కేజీ సిల్వర్ ధర రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.