ఉపాధ్యాయుల కొరతపై కలెక్టరేట్‌కు ఫిర్యాదు
NEWS Oct 29,2025 12:27 pm
కామారెడ్డి మండలం, శబ్దిపూర్ గ్రామంలోని ఎంపీపీఎస్‌లో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతపై కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులను నియమించి, విద్యాబోధనను మెరుగుపరచాలని వారు కలెక్టర్‌ను కోరారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా బీసీ అధ్యక్షులు కుంట రవి పాల్గొన్నారు.