డీజీపీని కలిసిన FGG ప్రతినిధులు
NEWS Oct 27,2025 11:26 pm
HYD: ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు పద్మనాభ రెడ్డి, సయ్యద్ రఫీ, వివేక్, భాస్కర్ రెడ్డి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. పౌరులు - పోలీసుల మధ్య సత్సంబంధాలు ఏర్పడేలా, ఫిర్యాదులను సత్వరంగా, నిష్పాక్షికంగా పరిష్కరించేలా సూచనలు ఇవ్వాలని కోరారు. పోలీసుల ప్రవర్తనపై ప్రజలు కొత్తగా ఏర్పాటైన పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చని డీజీపీ తెలిపారు. ఇక సంస్థ 15 ఏళ్ల సందర్భంగా రిలీజైన సోవనీర్‌ను డీజీపీకి అందజేశారు.