కామెరూన్ అధ్యక్షుడిగా పాల్ బియా(92) ఎనిమిదో సారి ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించారు. ఈనెల 12న జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు అక్కడి రాజ్యాంగ మండలి ఇవాళ ప్రకటించింది. 3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి 1982 నుంచి ప్రెసిడెంట్‌గా బియా కొనసాగుతుండటం గమనార్హం. మరోవైపు ప్రతిపక్షాల మద్దతుదారులు ఆందోళన చేపట్టగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనల్లో నలుగురు చనిపోయినట్టు సమాచారం.