కంటెంట్ క్రియేటర్లకు ఉద్యోగాలు
NEWS Oct 27,2025 11:03 pm
ఐటీ హైదరాబాద్ మల్టీ మీడియా కంటెంట్ క్రియేటర్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. మల్టీమీడియా కంటెంట్ క్రియేటర్ పోస్టులకు ఉద్యోగాలు భర్తి చేస్తారు. 60% మార్కులతో మల్టీ మీడియా ప్రొడక్షన్, ఫిల్మ్ స్టడీస్, విజువల్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్, గ్రాఫిక్ డిజైన్ టూల్స్ ప్రావీణ్యం ఉండాలి. ఏడాది అనుభవం. ఆన్లైన్ www.iith.ac.in ద్వారా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 7 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్, స్క్రీనింగ్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.