హైదరాబాద్: ఆటో డ్రైవర్ల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వారికి తీరని అన్యాయం చేస్తున్న తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ నేతలు ఆటోలో ప్రయాణించారు. కేటీఆర్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ ఆలీని స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని మోసాన్ని ప్రతిపక్ష పార్టీగా ఎండగట్టి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ తెలంగాణ భవన్‌కి చేరుకొని.. ఆటో డ్రైవర్ల సమావేశంలో ప్రసంగించారు.