హిట్ పెయిర్ రవితేజ - శ్రీలీల నటించిన కొత్త సినిమా ‘మాస్ జాతర’. మనదే ఇదంతా అనేది సబ్ టైటిల్. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 31న ఈ మూవీ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రవితేజ నుంచి ఆయన అభిమానులు ఆశించే కామెడీ, యాక్షన్ ఈ సినిమాలో మెండుగా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.