మెంథా తుపాన్‌పై ముందస్తు చర్యలు
NEWS Oct 27,2025 04:52 pm
అల్లూరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనంతగిరి మండలం, పినకోట, పెదకోట పంచాయతీ పరిధిలో మెంథా తుపాన్ ప్రభావంపై ముందస్తు సూచనలు చేశామని విఆర్ఓ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పినకోట, పెదకోట పంచాయతీలలోని విఆర్ఏలతో కలిసి కుడియా, కొండిభ కోట, తముటు గ్రామాల సమీపంలోని గెడ్డలను పరిశీలించారు. ప్రతి వాగుపై ఎవరూ రాకుండా స్థానిక విఆర్ఏలను కాపలా విధుల్లో ఉంచినట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏలు, గ్రామస్థులు పాల్గొన్నారు.