చిన్న శ్రీశైలం యాదవ్, రౌడీషీటర్ల బైండోవర్
NEWS Oct 27,2025 06:18 pm
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక మరి కొద్ది రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో నగర పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌తో సహా మరో 100 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. అయితే బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు.