టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో రెండ్రోజుల నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడుతున్న సమయంలో క్యాచ్ పట్టే క్రమంలో అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వెంటనే మైదానాన్ని వీడగా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో రిబ్స్‌లో రక్తస్రావం అయినట్లు గుర్తించారు. వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని క్రీడా వర్గాలు తెలిపాయి.