అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు: అనిత
NEWS Oct 27,2025 12:39 pm
AP: తుఫాను హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తుఫాను ప్రభావిత జిల్లాలకు శాటిలైట్ ఫోన్లు అందించడంతో పాటు NDRF, SDRF బృందాలను సిద్ధం చేశామన్నారు. సహాయక చర్యల కోసం ఇరిగేషన్, సివిల్ సప్లైస్, మెడికల్, విద్యుత్ శాఖల సిబ్బంది కూడా రెడీగా ఉన్నట్లు వివరించారు. అలాగే కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని, ప్రజలు అత్యవసర సాయం, తుఫాను సమాచారం కోసం పై నంబర్లను సంప్రదించాలన్నారు.