చిరు డీప్ ఫేక్‌లపై కేసులు నమోదు
NEWS Oct 27,2025 12:27 pm
చిరంజీవి ‘ఫోటోలు లేదా AI కంటెంట్‌ను’ ఉపయోగిస్తే.. అది పక్కా క్రైమ్ చర్యగా పరిగణించబడుతుందని కోర్టు వెల్లడించింది. డిజిటల్ వేదికలపై మెగాస్టార్, చిరు, అన్నయ్య పేర్లతో AI మార్ఫింగ్ చేయడంపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే చిరంజీవి పేరును, ఫొటోలను దుర్వినియోగం చేసిన 30 మందికి నోటీసులు జారీ చేసింది. డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల తమ ప్రతిష్ట దెబ్బతింటోందని, తమ పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లుతోందని ఇప్పటికే నటీనటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమితాబ్, ఐశ్వర్యరాయ్, రజినీకాంత్, నాగార్జున, రష్మిక లాంటి సినీ ప్రముఖులు కోర్టులను ఆశ్రయించారు.