దిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రతిపాదించారు. కేంద్ర న్యాయశాఖకు ఆయన పేరును సీజేఐ జస్టిస్ గవాయ్ ప్రతిపాదించారు. హర్యానాకు చెందిన జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నవంబర్ 24న ఆయన 53వ సీజేఐగా ప్రమాణం చేయనున్నారు.