2వేల మంది ‘శ్రీనివాస్’లు ఒకేచోట!
NEWS Oct 27,2025 11:15 am
కరీంనగర్: కొత్తపల్లి (మం) మల్కాపూర్‌లో ‘శ్రీనివాస్’ పేరున్న వారంతా కలిశారు. ‘శ్రీనివాస్’ పేరున్న వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలన్న సంకల్పంతో వూటుకూరి శ్రీనివాస్‌రెడ్డి (కరీంనగర్) ‘తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ’ను 2023లో ప్రారంభించారు. వాట్సప్ గ్రూపుతో మొదలైన ఈ ఉత్సాహం రెండేళ్లలో వేల మందికి విస్తరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో శ్రీనివాస్ పేరున్న 36,000 మంది తెలుగు వారిని 46 వాట్సప్ గ్రూపుల ద్వారా ఏకం చేశారు. ఈ సమ్మేళనానికి 2 వేల మంది హాజరయ్యారు.