ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అన్నదానం
NEWS Oct 26,2025 08:12 pm
హైదరాబాద్: అమ్మ హెల్పింగ్ హ్యాండ్, రెడీ టు సర్వ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 300 మందికి పైగా పేదలకు అన్నదానం నిర్వహించారు. MNJ, నీలోఫర్ అస్పత్రుల వద్ద పేదలకు, అస్పత్రుల్లో రోగులకు సహాయకులుగా వచ్చిన వారికి ఉచితంగా భోజనం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రతి ఆదివారం పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నట్టు రెడీ టు సర్వ్ నిర్వాహకులు పెద్ది శంకర్ తెలిపారు. ఈ సేవ కార్యక్రమంలో వాలంటరుగా పాల్గొనాలనుకునే వారు తమను సంప్రదించవాలని కోరారు.