ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం
NEWS Oct 27,2025 12:41 pm
రోలుగుంట మండలంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చోడవరం శాసనసభ్యులు కె.ఎస్.ఎస్. రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మౌళి చంద్ర, సిరిపురపు రమేష్, జనసేన పార్టీ నాయకులు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శిబిరంలో వివిధ వైద్య విభాగాల నిపుణులు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. స్థానికులు ఇటువంటి సేవా కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని కోరారు.