ఏపీలో మొంథా తుఫాన్ అలర్ట్
NEWS Oct 26,2025 09:48 am
ఏపీపైకి మొంథా తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న వాయుగుండంగా బలపడింది. కాకినాడకు 920కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం.. పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి ఇవాళ తీవ్ర వాయుగుండం రూపాంతరం చెందబోతోంది. సోమవారం తుఫాన్‌గా.. మంగళవారం తీవ్ర తుఫాన్‌గా మారి విరుచుకుపడే అవకాశం ఉంది. ఇక.. మంగళవారం సాయంత్రానికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాగా.. మొంథా తుఫాన్ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.