సజ్జనార్ డీపీ పెట్టుకుని మోసాలు
NEWS Oct 26,2025 09:32 am
హైదరాబాద్: నేరస్థుల వెన్నులో వణుకు పుట్టించే IPS ఆఫీసర్ సజ్జనార్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌లో సజ్జనార్ డీపీ పెట్టుకుని మెసేజులు పంపుతున్నారు. అలాంటి మెసేజులకు స్పందించవద్దని, ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్లకు వ్యక్తిగత వివరాలు అసలే ఇవ్వొద్దని, డబ్బులు అడిగితే పంపవద్దని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930