సెంచరీతో సమాధానమిచ్చిన రోహిత్ శర్మ
NEWS Oct 25,2025 09:13 pm
కెప్టెన్సీ పోయింది.. ఇక రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నాడంటూ వస్తున్న విమర్శలకు టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ తన బ్యాట్‌తో గట్టి సమాధానం చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో, చివరి వన్డేలో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. శతకం పూర్తి చేశాక హెల్మెట్ కూడా తీయకుండా, కేవలం బ్యాట్ పైకెత్తి సింపుల్ గా అభివాదం చేశాడు. రోహిత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలుపు ముంగిట నిలిచింది.