వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభం
NEWS Oct 25,2025 09:14 pm
జగిత్యాల: కొడిమ్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కొడిమ్యాల, రామకృష్ణాపూర్, నాచుపల్లి, కొండాపూర్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్లు, నాయకులు, రైతులు, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.